నితిన్,రష్మిక మంథాన ప్రధాన పాత్రలలో వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న చిత్రం భీష్మ. ఫిబ్రవరి 21న విడుదల కానున్న ఈ చిత్రం ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. నేడు వేలంటైన్స్ డే సందర్భంగా చిత్రం నుండి సింగిల్స్ యాంథమ్ అనే రొమాంటిక్ సాంగ్ విడుదల చేశారు. ఇందులో నితిన్ లుక్ డిఫరెంట్‌గా ఉంది. కొన్నాళ్ళుగా సరైన హిట్ లేక సతమతమతున్న నితిన్ ఈ సినిమాతో మంచి హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. గతంలో నితిన్ దశాబ్ద కాలం పాటు విజయాలకు దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, అ..ఆ.. లాంటి చిత్రాలు నితిన్ మార్కెట్ ని పెంచుతూ వచ్చాయి. ప్రస్తుతం నితిన్ కు తెలుగు రాష్ట్రాల్లో మంచి మార్కెట్ ఉంది. అది నిలబడాలంటే భీష్మ చిత్రంతో నితిన్ సక్సెస్ అందుకోవాలి అని విశ్లేషకులు అంటున్నారు. తాజాగా విడుదలైన వీడియో సాంగ్‌పై మీరు ఓ లుక్కేయండి.
నితిన్ 'భీష్మ' నుండి వీడియో సాంగ్ విడుదల